సచిన్, రోహిత్, కోహ్లీల సరసన శుభ్‌మన్‌ గిల్‌

సచిన్, రోహిత్, కోహ్లీల సరసన శుభ్‌మన్‌ గిల్‌

టీమ్ఇండియా యువ సంచలనం శుభ్మన్ గిల్ వన్డేల్లో బీభత్సమైన ఫామ్ తో  రెచ్చిపోతున్నాడు.  ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సెంచరీతో ఆకట్టకున్నాడు. గిల్ కు వన్డేల్లో ఇది 6వ సెంచరీ కాగా,  ఈ ఏడాది ఐదవ సెంచరీ. గిల్ తాజా సెంచరీతో సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, శిఖర్‌ ధవన్‌ల సరసన చేరాడు. వీరంతా  ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో ఐదు అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేశారు. ఇప్పుడు వీరి సరసన గిల్ చేరాడు.  

విరాట్‌ కోహ్లి అత్యధికంగా ఓ ఏడాది 5 అంతకంటే సెంచరీలను నాలుగు సార్లు (2012, 2017, 2018, 2019) చేయగా.. రోహిత్‌ శర్మ మూడు సార్లు (2017, 2018, 2019), సచిన్‌ టెండూల్కర్‌ రెండు సార్లు (1996, 1998), రాహుల్‌  ద్రవిడ్‌ (2019), గంగూలీ (2000), ధవన్‌ (2013), గిల్‌ (2023) తలో సారి ఈ ఘనతను సాధించారు.

ఇక వన్డే కెరీర్ లో గిల్  మొత్తంగా 35 మ్యాచ్‌లు ఆడి 66.10 సగటున 6 సెంచరీలు, 9 అర్ధసెంచరీల సాయంతో 1919 పరుగులు చేసిన గిల్‌.. ఈ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్‌ల్లో 1225 పరుగులు చేశాడు.