10 వారాలు షట్ డౌన్ లేదంటే సంక్షోభమే: ట్రంప్ కు బిల్ గేట్స్ సలహా

10 వారాలు షట్ డౌన్ లేదంటే సంక్షోభమే: ట్రంప్ కు బిల్ గేట్స్ సలహా

అమెరికా వ్యాప్తంగా పది వారాల పాటు షట్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని, లేదంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సూచించారు. దేశంలో కరోనా కేసులు 2 లక్షలకు చేరిన సమయంలో ..ఆయన ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పేపర్ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఎవరినీ నిందించకుండా.. దేశవ్యాప్త షట్ డౌన్ ను అమలు చేయాలన్నారు. చాలా రాష్ట్రాల్లో బీచ్ లు ఇంకా తెరచుకునే ఉన్నాయిన్నారు. రెస్టారెంట్లు కూడా పని చేస్తున్నాయని.. ప్రజలు స్వేచ్ఛగా బయట ప్రయాణిస్తున్నారన్న బిల్ గేట్స్…. వైరస్ కూడా అలాగే వ్యాపిస్తోందన్నారు. దీన్ని అరికట్టాలంటే షట్ డౌన్ ఒక్కటే మార్గమన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టేంత వరకూ షట్ డౌన్ చేయాలని… అప్పుడే ప్రజలను కాపాడుకోవచ్చన్నారు. అది కూడా కనీసం 10 వారాల పాటు అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ కు బిల్ గేట్స్ సలహా ఇచ్చారు. ఈ విషయంలో వెనక్కి తగ్గితే … ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.