ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి :  సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి

తొగుట (రాయపోల్) వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిద్దిపేట కలెక్టర్​ కె.హైమావతి ఆదేశించారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. 

అనంతరం తహసీల్దార్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. భూముల రిజిస్ట్రేషన్ వివరాలు ఆరా తీశారు. రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణలో మండలంలోని ఆయా గ్రామాల్లో భూ యజమానులతో మాట్లాడి ఆర్బిట్రేషన్ 100 శాతం పూర్తి చేయాలని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.