
సిద్దిపేట రూరల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ మనుచౌదరి తహసీల్దార్సలీం మియాను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లోని కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం పరిశీలించి ప్రస్తుతం ఎన్ని ట్రక్కుల ధాన్యం రవాణాకు సిద్ధంగా ఉందని నిర్వాహకులను అడిగి తెలుసున్నారు.
అనంతరం మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామని, తడిసినధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపుతున్నామన్నారు. అందుబాటులో ఉన్న 500 టార్ఫాలిన్ కవర్లను ధాన్యం తడవకుండా ఉపయోగించాలని, అదనంగా రెండు ప్యాడి క్లీనర్లను సమకూర్చుకోవాలని జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజుకు సూచించారు.