సిద్దిపేట జిల్లాలోని రోడ్ల మరమ్మతుకు రూ.379.69 కోట్లు విడుదల

సిద్దిపేట జిల్లాలోని రోడ్ల మరమ్మతుకు రూ.379.69 కోట్లు విడుదల

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని 25 ఆర్ అండ్ బీ రోడ్ల కు మహర్దశ పట్టనున్నది. హ్యామ్ (హైబ్రీడ్ అన్యూటీ మోడ్)  ప్రోగామ్ ఫేజ్ 1 లో జిల్లాలోని 25 రోడ్ల కు సంబంధించి 289 కిలో మీటర్ల లో మరమ్మతులు, డబుల్ లైన్ల తో పాటు అవసరమైన చోట విస్తరణకు రూ.379.69 కోట్లను ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించి స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చేర్యాల: తమ నాయకుల వల్లే నిధులు మంజూరయ్యాయని శుక్రవారం చేర్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్​నాయకులు పోటాపోటీగా క్షీరాభిషేకాలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి వల్లే నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్​ నాయకులు, లేదు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి చొరవతోనే మంజూరయ్యాయని బీఆర్​ఎస్​నాయకులు వారి నాయకుల ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్​ నాయకులు రవి, మల్లేశం, శ్రీకాంత్, బీఆర్ఎస్​ నాయకులు కర్ణాకర్, బాలనర్సయ్య, నాగేశ్వర్​ రావు, పర్వతాలు, మానస, నర్సయ్య పంతులు, శ్రీధర్​రెడ్డి , అంజయ్య పాల్గొన్నారు.