అరేకా ఇస్తరాకులకు పెరిగిన గిరాకీ

అరేకా ఇస్తరాకులకు పెరిగిన గిరాకీ

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బదులుగా.. ఫంక్షన్లలో వాడుకునేందుకు ప్రత్యేకంగా ఇస్తరాకులు తయారు చేస్తున్నారు సిద్ధిపేటకు చెందిన యువకులు. అరేకా ఆకులతో చేస్తున్న ఈ ఇస్తరాకులకు మంచి గిరాకీ ఉందంటున్నారు. పర్యావరణానికి హాని కలగకూడదనే వీటిని తయారు చేస్తున్నామని  నిర్వాహకులు చెబుతున్నారు.

పెళ్లైనా, దావత్ అయినా వందల మంది అతిథులకు విందు ఇవ్వాల్సిందే. వాటికోసం వాడే యూజ్ అండ్ త్రో ప్లేట్లతో పర్యావరణానికి హాని చేసినవాల్లమవుతున్నాం. పాలిథిన్ తో తయారు చెసే యూజ్  అండ్  త్రో మెటీరియల్  తో భారిగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయాలపై పబ్లిక్ నజర్ పెడుతున్నారు . 

సిద్దిపేటకు చెందిన కొంతమంది ఔత్సాహికులు  ప్లాస్టిక్  కు ప్రత్యామ్నాయంగా.. అంతే సౌకర్యంగా ఉండేలా ఇస్తర్ల తయారి ప్రారంబించారు.  ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చెసుకున్నప్రత్యేకమైన అరేకా లీఫ్ తో ప్లేట్ల తయారి చేస్తూ తమ వంతుగా పర్యావరణాన్ని కాపాడుతు ఉపాధి పొందుతున్నారు. కరోనా తరువాత ఉపాధి మార్గాలపై అన్వేషిస్తున్న తరుణంలో.. సిద్దిపేటలో పాలిథిన్, ప్లాస్టిక్ పై నిషేదం స్టిక్ట్ గా అమలవుతున్న సందర్బంలో అరేకా లీఫ్ ప్లేట్ల ఐడియా వచ్చింది. ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి... కర్ణాటక నుండి అరికా లీఫ్ ను తెచ్చి.. మిషిన్ లను కొనుగోలు చేశారు.  బఫేకు అనుకులంగా ఉండేలా ఆకుతో చేసినా గట్టిగా నిలబడి పట్టుకొని తినేలా ఉండే విస్తర్లను తయారు చేశారు. 

అరేకా ఆకు గట్టిగా ఉండడం ఇస్తర్ల తయారీకి అనుకూలంగా ఉంది. అలాగే దాన్ని గంటలపాటు నానబెట్టి ఉంచితే మనం అనుకున్నఆకారంలోకి మారడం ప్లస్ పాయింట్ అంటున్నారు నిర్వాహకులు.  ఆరోగ్యానికి హానికరం కాకుండా ..ఈ ఆకులో తింటే హెల్త్ బెన్ఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు. అరికా ఆకులతో చేసిన ఇస్తర్లకు ఆదరణ పెరుగుతోంది. మొదట్లో ధర ఎక్కువ అని అనుకున్నా పర్యావరణ పట్ల అవగాహన ఉన్నవాళ్లు తీసుకెళ్తున్నారు.