హైదరాబాద్‌‌‌‌లో కాన్‌‌‌‌ప్లెక్స్ సినిమాస్.. దేశవ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్స్‌.. ఫస్ట్ ‘ఓజీ’ తోనే షురూ

హైదరాబాద్‌‌‌‌లో కాన్‌‌‌‌ప్లెక్స్ సినిమాస్.. దేశవ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్స్‌.. ఫస్ట్ ‘ఓజీ’ తోనే షురూ

హైదరాబాద్​లోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌‌‌‌లో కాన్‌‌‌‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌‌‌‌ను బుధవారం ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హీరో సిద్దు జొన్నలగడ్డ, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో ఈ థియేటర్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. థియేటర్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ‘థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌‌‌‌ను సందర్శించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

విజ్ఞాన్ యార్లగడ్డ మాట్లాడుతూ ‘గుజరాత్‌‌‌‌కు చెందిన కాన్‌‌‌‌ఫ్లెక్స్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌కు దేశవ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్స్‌‌‌‌ ఉన్నాయి. హైదరాబాద్‌‌‌‌లో ఇదే ఫస్ట్ థియేటర్‌‌‌‌‌‌‌‌. ప్రేక్షకులకు లగ్జరీ సీటింగ్, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను అందించాలని దీన్ని ప్రారంభించాం. ముఖ్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో స్క్రీనింగ్‌ల కోసం, మొత్తం 170 సీటింగ్ సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్‌లు ఉన్నాయి. అన్నీ డాల్బీ సరౌండ్ సౌండ్ మరియు 2K ప్రొజెక్షన్‌తో అమర్చబడి ఉన్నాయి. ‘ఓజీ’ మూవీతో దీన్ని ప్రారంభిస్తున్నాం’ అని చెప్పారు.