Tillu Square: లిల్లీ వదిలేసి వెళ్ళకు ..మళ్లీ గాయం చేయకు..ఈ లొల్లి ఏందీ టిల్లు

Tillu Square: లిల్లీ వదిలేసి వెళ్ళకు ..మళ్లీ గాయం చేయకు..ఈ లొల్లి ఏందీ టిల్లు

గతేడాది ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’గా ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ సక్సెస్‌‌ను అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‍గా ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) సినిమా తెరకెక్కుతోంది.

మల్లిక్ రామ్ (MallikRam) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఓ మై లిల్లీ అంటూ సాగే ఈ సాంగ్ హార్ట్ బ్రేకింగ్ ఉంటూనే..డీజే టిల్లు లో లాగా రొమాంటిక్ సాంగ్ లానే సాగింది.

లిల్లీ వదిలేసి వెళ్ళకు ..మళ్లీ గాయం చేయకు అని టిల్లు పాడుతున్న ఈ పాటకు..రామ్ మిరియాల సంగీతం అందించాడు.శ్రీరామ్ చంద్ర తన హస్కీ వాయిస్ తో ఆకట్టుకున్నాడు. ఈ స్పెషల్ సాంగ్ కు హీరో సిద్దు లిరిక్స్ అందివ్వడం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ఆడియన్స్ను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. రాధికా..రాధికా..ముందుకా..వెనుకాక..'రింగుల జుట్టు చూసి పడిపోయానే..నీ మాటలు విని పడిపోయానే..నీ గాలి సోకితేనే సచ్చిపోయానే' అనే సాంగ్తో యూత్లో మంచి జోష్ తీసుకొచ్చారు మేకర్స్. 

ఈ సినిమాకు రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై టిల్లు స్క్వేర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మూవీ మార్చి 29 న థియేటర్స్ లోకి రానుంది.