మెగా ఆఫర్ను రిజెక్ట్ చేసిన సిద్దు.. ఆ రీమేకే కారణమా?

మెగా ఆఫర్ను రిజెక్ట్ చేసిన సిద్దు.. ఆ రీమేకే కారణమా?

డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో మనోడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) సినిమాలో కూడా అవకాశం వచ్చిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అయితే ఈ ఆఫర్ ను సిద్దు సింపుల్ గా రిజెక్ట్ చేశారట. దానికి కారణం అది రీమేక్ ప్రాజెక్ట్ కావడమే. మలయాళంలో యావరేజ్ రిజల్ట్ అందుకున్న "బ్రో డాడీ(Bro Daddy)" సినిమాను తెలుగులో మెగాస్టార్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల(Kalyan krishna kurasala). దీనికి సంబందించిన కథ చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. 

అయితే కథ పరంగా ఈ సినిమాలో మరో యంగ్ హీరోకి ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్ర కోసం చాలా మదిని అనుకున్నారట మేకర్స్. కానీ ఫైనల్ గా సిద్దు ను ఫిక్స్ ఆయ్యారట. ఇందుకు చిరు కూడా ఓకే చెప్పేశారట. ఇక ఇదే విషయాన్ని సిద్దును అడిగాగా.. ఆయన సింపుల్ గా నో చెప్పేశాడట. దానికి కారణం సిద్దు రీమేక్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అవడమే. ఇదే విషయాన్ని దర్శకుడు కళ్యాణ్ కు కూడా వివరించారట సిద్దు. ఈ యంగ్ హీరో చెప్పిన రీజన్ కు కన్విన్స్ అయిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. వేరే హీరోను వెతికే పనిలో పడ్డాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.