అమిత్ షా ఎదుట మూసేవాలా తండ్రి కన్నీళ్లు

అమిత్ షా ఎదుట మూసేవాలా తండ్రి కన్నీళ్లు

ఇటీవల దారుణ హత్యకు గురైన పంజాబీ సింగర్ సిధు మూసేవాలా తల్లిదండ్రులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం ఉదయం చండీగఢ్ కు వచ్చిన అమిత్ షాతో వారు విమానాశ్రయంలో భేటీ అయ్యారు. తమ కుమారుడి హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని వారు కోరారు. ఈసందర్భంగా మూసేవాలా గురించి వివరిస్తూ.. ఆయన తండ్రి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులు జోడించి.. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని అమిత్ షాను కోరారు. తమ కుమారుడికి ఆప్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిన 24 గంటల్లోపే ఈ హత్య జరిగిందని గుర్తు చేశారు.

కాగా, కొన్ని రోజుల క్రితం సిధు మూసేవాలా తల్లిదండ్రులను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పరామర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశాన్ని కల్పించాలని ఆ సందర్భంగా మూసేవాలా తల్లిదండ్రులు షెఖావత్ కు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన షెఖావత్ ఈనెల 4న (శనివారం) చండీగఢ్ కు అమిత్ షా వస్తున్నారని, అప్పుడు కలిసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈక్రమంలోనే అమిత్ షా ను వారు కలిసే ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు..

సివిల్స్ పాసయ్యానని సంతోషం.. అంతలోనే షాకింగ్ న్యూస్

2000 ఏళ్ల కిందటి గోడ అవశేషాలు