
శంషాబాద్, వెలుగు: కన్వర్టర్‌లో బంగారం దాచి తీసుకెళ్తున్న ప్యాసింజర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి ఫ్లైట్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన ఓ ప్యాసింజర్ ఓల్టేజ్ అప్ డౌన్ ఏసీ(అల్టర్నేట్ కరెంట్) కన్వర్టర్ లో బంగారాన్ని దాచి తీసుకొచ్చాడు. స్కానింగ్ లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు ప్యాసింజర్‌ను అదుపులోకి తీసుకుని 316.40 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గోల్డ్ విలువ రూ.15 లక్షల 70 వేలు ఉంటుందని అంచనా వేశారు. ప్యాసింజర్ పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.