
కార్తీక మాస శుక్ల ద్వాదశినే “క్షీరాబ్ది ద్వాదశి ” అని పిలుస్తారు. ఈ ఏడాది (2025) నవంబర్ 2 ఆదివారం వచ్చింది. పురాణాల ప్రకారం ఈ రోజు పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనది. శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగనిద్ర నుంచి మేల్కొని, లక్ష్మీదేవితని ఈరోజున కలిశాడని పండితులు చెబుతున్నారు. ఈ ద్వాదశిని “లక్ష్మీనారాయణ కల్యాణం జరిగింది.
హరిబోధిని ఏకాదశి లేదా దేవోత్తాని ఏకాదశి, శ్రీహరి యోగనిద్రలో నుండి మేల్కొన్న రోజు కార్తీక శుద్ద ఏకాదశి. తదుపరి రోజు ద్వాదశి క్షీరసాగర తీరంలో లక్ష్మీదేవి దర్శనం పొందిన సందర్భం అని పురాణాలు పేర్కొంటాయి. ఈ రోజున తులసి మాతను పూజించాలి.తులసీ, శాలిగ్రామ వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. తులసీ భక్తిని, శాలిగ్రామం పరమాత్మత్వాన్ని సూచిస్తూ, ఈ కలయిక భక్తి, భగవంతుల ఏకత్వానికి చిహ్నంగా భావిస్తారు.
పూజా చేయాల్సిన విధానం..
- క్షీరాబ్ధి ద్వాదశి రోజున ( నవంబర్2 ) సాయంత్రం ఇంట్లోని తులసి కోటను శుభ్రపరిచి, అలంకరించి, దీపాలంకరణ చేయాలి.
- పువ్వులు, పళ్ళు, తులసీదళాలను విష్ణుమూర్తికి సమర్పించాలి.
- క్షీరసాగర మథనం ద్వారా ఉద్భవించిన శ్రీమహాలక్ష్మీదేవి క్షీరాబ్ధిద్వాదశినాడు విష్ణువును వరించగా, ఈ రోజు సంపద, ఐశ్వర్య, శాంతిలకు సూచికగా మారిందని పండితులు చెబుతున్నారు.
- వైష్ణవ దేవాలయాలలో సహస్రనామ పారాయణం, దీపారాధన, అన్నదానం వంటి విశేష పూజలు జరుగుతాయి.
- తిరుమలలో కైశిక ద్వాదశి ఉత్సవం ఈ రోజుకే ప్రత్యేకత, ఉదయం ఉగ్రశ్రీనివాస దర్శనం సంప్రదాయంగా నిర్వహిస్తారు. ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
- ఈ రోజు విష్ణుసహస్రనామం, శ్రీసూక్తం, పురుషసూక్తం పారాయణం చేయడం పాపక్షయకరం.
- భక్తులు ఉపవాసం పాటించి, పాలు, బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
- సాయంత్రం తులసీ చుట్టూ దీపాలు వెలిగించి, కుటుంబమంతా కలసి భజనలు, హరికీర్తన చేస్తే ఆ గృహం ఐశ్వర్యవంతమవుతుంద ని విశ్వాసం.
- ఈ రోజు ఒక తులసీ మొక్కను నాటి, దానికి నీరు పోసి “శ్రీసురభ్యై నమః” మంత్రంతో పూజిస్తే దీర్ఘ ఆయుష్షు, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయి.
- తులసీదళం వలన దరిద్ర్యనివారణ, జ్ఞానవృద్ధి, సంతానసాఫల్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
- ఈ రోజు విష్ణు మూర్తి, లక్ష్మి దేవి విగ్రహాల స్నానాభిషేకం చేసి, తులసీదళార్చన చేయడం పుణ్యప్రదం.
- తులసీదళం–హరినామం–దీపదానం, ఈ మూడూ కలిసి పాపవిమోచనం, ధనవృద్ధి, శాంతి, మోక్షసాధనకు మార్గం చూపుతాయి.
- క్షీరాబ్ది ద్వాదశి నాడు గోపూజ, అన్నదానం చేయడం విశేష ఫలప్రదం.
- పిల్లలకు తులసీ పూజా ప్రాముఖ్యత వివరించడం, ఆచార సంప్రదాయాలను నేర్పడం ఈ రోజు శ్రేష్ఠకార్యం.
- ఈ రోజు చేసే ప్రతి పూజా కార్యం లక్ష్మీకటాక్షాన్ని పెంచుతుంది, భక్తితో చేసే దీపారాధన జీవనంలో వెలుగును తెస్తుంది.
- “ఓం నమో నారాయణాయ” అనే మంత్రజపం పుణ్యాన్ని వందరెట్లు పెంచుతుంది.
- భక్తులు సాయంత్రం హరినామసంకీర్తన చేసి, శ్రద్ధతో తులసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దివ్యశాంతి కలుగుతుంది, తులసీ, శాలిగ్రామ కల్యాణానికి సాక్ష్యం వహించడం మనలోని దైవభక్తి, విశ్వాసానికి ప్రతీక.
- క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసినవారు కుటుంబ సౌఖ్యం, దాంపత్య ఐక్యత, ధనసమృద్ధి పొందుతారు.
- ఈ రోజు దానం చేసిన దీపం మన పాపాలను దహనం చేస్తుంది, మనసును శాంతితో నింపుతుంది.
- తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి. మండపం చుట్టూ ఎర్రటి చీరతో కట్టండి. అలాగే తులసి మొక్కకు లేదా చెట్టుకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి.
- తులసి కొమ్మలకు ఎర్రటి గాజులతో అలంకరించండి. విఘ్నేశ్వరుడు .. ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలిగ్రామ్ ను కూడా ఆరాధించండి.
- తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ , చక్కెర బొమ్మలు , ఐదు రకాల పండ్లను ఉంచండి. అనంతరం హారతి ఇచ్చి తులసిమొక్క రూపంలో ఉన్న లక్ష్మీదేవిని ఆరాధించి పూజించండి.
క్షీరాబ్ధి ద్వాదశి పండుగ యొక్క ప్రాముఖ్యత..
- తులసి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
- వివాహ సంబంధిత సమ్యలను తొలగిస్తుందని చెబుతారు.
ద్వాదశ దీపాలు..
- క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో హిందువుల ఇళ్లలో తులసి మొక్క , లేదా తులసి చెట్టు దగ్గర ధాత్రి (ఉసిరి మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు.
- 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంటా దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి.
తులసి మొక్కను గౌరీదేవిగా...
తులసి మొక్కను గౌరీదేవిగా , ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజింపడం వల్ల , గౌరీ పూజ చేయడం వ్లల ఆర్థిక బాధలు తొలగి , సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి , స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ ఉంటుంది.లక్ష్మీ ఉంటే కరువు అనేది ఉండదు , కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది. భక్తి (తులసీ) + ధర్మం (దానం, జపం) + దివ్యస్మరణ (హరి నామం) = శాంతి, శ్రేయస్సు, శ్రీకటాక్షం లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.