శ్రీరామనవమి రోజు పానకానికి ఎందుకు ప్రాధాన్యతో తెలుసా...

 శ్రీరామనవమి రోజు పానకానికి ఎందుకు ప్రాధాన్యతో తెలుసా...

 శ్రీరామనవమి (Sri Rama Navami) వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది పానకమే. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా పానకాన్ని అందరూ ఇష్టంగా తాగుతుంటారు. శ్రీరామ నవమికి దేవాలయాల్లో పానకం కలుపుతూ ఆలయానికి వచ్చిన వారికి గ్లాస్ లో ఇస్తూ భలే సందడి చేస్తుంటారు. అసలు పానకం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా..! కానీ ఎందుకు చేసుకోరు శ్రీరామ నవమి రోజు ఎందుకు పానకం చేస్తారో తెలుసుకుందాం. 

సాధారణంగా ఒక్కో పండగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. అలాగే ఒక్కో పండగకు హిందువులు పూజించే దేవుళ్లలో ఒక్కో స్వామి వారికి ఒక్కొక్క నైవేద్యం పెడతారు. అలా పెట్టడానికి విశిష్టతతో పాటు మన పూర్వికులు పాటిస్తున్న సంప్రదాయంతో పాటు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాట్టిస్తుంటారు.

శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ రామచంద్రుడు జన్మించిన రోజు అదే రోజున రాముల వారి కల్యా ణం జరిగిన సందర్భంగా శ్రీరామ నవమిగా ప్రజలు జరుపుకుంటాము. అలాగే మొట్ట మొదటిగా కొత్త సంవత్సరం వచ్చాక మొదట జరుపుకొనేది ఉగాది పండుగ ఆ తరవాత వచ్చే శ్రీరామనవమి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపు కుంటారు. శ్రీరామ నవమి రోజున స్వామి వారికి రక రకాల పూలు పళ్ళతో పాటు పానకం,వడపప్పు, బెల్లం కూడా స్వామి వారికి నైవేద్యంగా పెడతారు.

పానకం తయారు చేసేందుకు బెల్లం, మిరియాలు, వేస్తారు ఆ పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి. అంతే కాకుండా పానకం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. శ్రీ రామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా భక్తులు నమ్మి పూజిస్తుంటారు. ఈ భూమిపై జరిగే చెడుని సంహరించేందుకు ఆయన రామా అవతారంలో పుట్టారని భావిస్తారు.

రామచంద్రమూర్తికి బెల్లమన్నా మరియు పానకం అన్నా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు. అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చారని చెబుతారు.

ఎండలుముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచి పెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.