సైమా అవార్డ్స్‌-2023.. నామినేషన్స్లో ఆర్ఆర్ఆర్, సీతా రామం హవా

సైమా అవార్డ్స్‌-2023.. నామినేషన్స్లో  ఆర్ఆర్ఆర్, సీతా రామం హవా

సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా(SIIMA-2023) అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ ఈ వేదికగా ఘనంగా జరగనుంది. తాజాగా సైమా అవార్డ్స్ లో పోటీ పడే సినిమాల లిస్టును రిలీజ్ చేశారు నిర్వాహకులు. వాటిలో తెలుగు నుండి RRR 11, సీతా రామమ్ 10 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకొని సత్తా చాటాయి. 

ఇక భాషల వారీగా సైమా అవార్డ్స్ కోసం నామిషన్స్ దక్కించుకున్న సినిమాల లిస్టు ఇలా ఉంది. తెలుగులో బెస్ట్ మూవీ విభాగంలో RRR, డీజే టిల్లు, కార్తికేయ2, మేజర్, సీతా రామమ్ చోటు దక్కించుకున్నాయి.

తమిళంలో పొన్నియిన్ సెల్వన్-1, విక్రమ్, లవ్ టుడే, తిరుచిత్రంబలం,  రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రాలు  బెస్ట్ మూవీ కేటగిరీలో పోటీపడుతున్నాయి. వీటిలో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ -1 10 విభాగాల్లో, కమల్ హాసన్  విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి.

ఇక కన్నడలో కాంతార, కేజీయఫ్‌-2, 777 చార్లీ, లవ్ మాక్‌టెయిల్ 2, విక్రాంత్ రోనా సినిమాలు ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతున్నాయి. వాటిలో కాంతార, కేజీయఫ్‌-2 చిత్రాలు ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకొని సత్తా చాటాయి. 

ఇక మలయాళ ఇండస్ట్రీ నుండి భీష్మ పర్వం, తల్లుమాల, హృదయం, జయ జయ జయ హే, జన గణ మన, న్నా తాన్ కేస్ కొడుకు వంటి  చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో పోటీ పడుతున్నాయి. వాటిలో భీష్మ పర్వం చిత్రానికి 8, థల్లుమాల మూవీకి  7 నామినేషన్స్‌ దక్కాయి.