కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ఆల్ రౌండర్

కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ఆల్ రౌండర్

జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా టీ20 వరల్డ్ కప్లో దూసుకుపోతున్నాడు. ప్రతీ మ్యాచ్లో బ్యాటింగ్ లేదా బౌలింగ్లో రాణిస్తూ..జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. గ్రూప్ స్టేజ్ నుంచి జింబాబ్వే సూపర్ 12లో అడుగుపెట్టడంలో సికందర్ రజానే ముఖ్యపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే సికందర్ రజా..విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రజా...
టీ20 వరల్డ్ కప్ 2022లో గ్రూప్ స్టేజ్లో జింబాబ్వే మూడు మ్యాచులు ఆడింది.  ఐర్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో జింబాబ్వే  గెలిచింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్లో రాణించిన సికందర్ రజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఆ తర్వాత విండీస్తో జరిగిన మ్యాచ్ ఓడిపోగా...స్కాట్లాండ్తో జరిగిన మరో మ్యాచ్లో జింబాబ్వే విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనూ రజా ఆల్ రౌండర్గా రాణించాడు. దీంతో మరోసారి అతన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. తాజాగా పాక్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన రజా..బౌలింగ్లో రెచ్చిపోయాడు. మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 

కోహ్లీ రికార్డు బద్దలు..
టీ20 వరల్డ్ కప్ 2022 లో ఇప్పటి వరకు మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న సికందర్ రజా...అరుదైనఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఏకైక ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇదే క్రమంలో అతను కోహ్లీ రికార్డును అధిగమించాడు.2016 టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ రెండుసార్లు ఈ అవార్డును అందుకున్నాడు. 

క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు...
టీ20 కాలెండర్ ఇయర్లోనూ అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ప్లేయర్గానూ సికందర్ రజా నిలిచాడు. ఒక కాలెండర్ ఇయర్లో రజా ఏడు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇదే ఏడాది అతనికి ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ రికార్డు గతంలో కోహ్లీ పేరిట ఉండేది. 2016లో కోహ్లీ టీ20ల్లో ఆరు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.