సెమీస్‌‌‌‌‌‌‌‌లో సిక్కి-సుమిత్‌‌‌‌‌‌‌‌ జోడీ .. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోనే సింధు ఓటమి

సెమీస్‌‌‌‌‌‌‌‌లో సిక్కి-సుమిత్‌‌‌‌‌‌‌‌ జోడీ .. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోనే సింధు ఓటమి

స్పెయిన్‌‌‌‌‌‌‌‌: ఇండియా డబుల్స్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు సిక్కి రెడ్డి–సుమిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌ స్పెయిన్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌లో సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. శుక్రవారం జరిగిన మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో సిక్కి–సుమిత్‌‌‌‌‌‌‌‌ 14–21, 21–11, 21–17తో రెహాన్‌‌‌‌‌‌‌‌ నుఫల్‌‌‌‌‌‌‌‌ కుషర్‌‌‌‌‌‌‌‌జంతో–లిసా అయు కుసుమవాటి (ఇండోనేసియా)పై గెలిచారు. 41 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండోనేసియా ద్వయం తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో 1–1 తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

స్పష్టమైన ఆధిక్యంతో ఈజీగా గేమ్‌‌‌‌‌‌‌‌ను సాధించారు. అయితే రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో వ్యూహాత్మకంగా ఆడిన సిక్కి–సుమిత్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌ కోర్టు ర్యాలీలతో రెహాన్‌‌‌‌‌‌‌‌–లిసాకు అడ్డుకట్ట వేశారు. 2–2తో స్కోరు సమమైన తర్వాత సిక్కి–సుమిత్‌‌‌‌‌‌‌‌ వరుస పాయింట్లతో హోరెత్తించారు. ఇక డిసైడర్‌‌‌‌‌‌‌‌లో ఇరువురు హోరాహోరీగా పోటీపడ్డారు. దీంతో ఒక్కో పాయింట్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంతో ముందుకెళ్తారు. ఈ క్రమంలో 13–13తో స్కోరు ఈక్వల్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ఈ దశలో సిక్కి జంట 4, 2, 2 పాయింట్లతో గేమ్‌‌‌‌‌‌‌‌, మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో పీవీ సింధుకు నిరాశే ఎదురైంది.

క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో సుపానిద కెటాహోంగ్‌‌‌‌‌‌‌‌ (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌) 24–26, 21–17, 22–20తో సింధును ఓడించింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌‌‌‌‌‌‌‌లో ఓ దశలో ఇద్దరు 12–12తో సమంగా నిలిచారు. ఇక్కడి నుంచి స్మాష్‌‌‌‌‌‌‌‌లు ఆడిన కెటాహోంగ్‌‌‌‌‌‌‌‌ 20–15 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. కానీ పట్టువిడవకుండా పోరాడిన సింధు వరుసగా 5 పాయింట్లు గెలిచి 20–20తో స్కోరు ఈక్వల్‌‌‌‌‌‌‌‌ చేసినా చివర్లో చతికిలపడింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 13–21, 19–21తో లీ చెయ్‌‌‌‌‌‌‌‌ సిన్‌‌‌‌‌‌‌‌–టెంగ్‌‌‌‌‌‌‌‌చున్‌‌‌‌‌‌‌‌ సున్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ) చేతిలో ఓడారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో అర్జున్‌‌‌‌‌‌‌‌–ధ్రువ్‌‌‌‌‌‌‌‌ కపిల 19–21, 23–21, 17–21తో జునైది ఆరిఫ్‌‌‌‌‌‌‌‌–రాయ్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ (మలేసియా) చేతిలో పరాజయంపాలయ్యారు.