Gautam Adani: మౌనం అంటే లొంగుబాటు..మీ కథ మీరే చెప్పండి..ఇతరులకు ఛాన్స్ ఇస్తే తిరగ రాస్తారు.. గౌతమ్ అదానీ

Gautam Adani: మౌనం అంటే లొంగుబాటు..మీ కథ మీరే చెప్పండి..ఇతరులకు ఛాన్స్ ఇస్తే తిరగ రాస్తారు.. గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్​ తన గుర్తింపు తానే చాటుకోవాలని.. దానికి విదేశీ స్వరాలను అనుమతించడం మానేయాలన్నారు. మన గురించి మనం చెప్పుకోపోతే.. మనం ఎవరో.. మన గుర్తింపు ఏమిటో ఇతరులు నిర్వచిస్తారని అలాంటి పరిస్థితి భారత దేశానికి రాకూడదని అన్నారు గౌతమ్​ అదానీ. భారత్​ తన ప్రపంచ కథనాన్ని తానే నిర్వహించుకోవాలని అన్నారు. మౌనం వినయం కాదు.. అది లొంగిపోవడం.. భారత దేశ కథలు ఇతర దేశాల కటకటాల నుంచి  ఎలా చెప్పారో ఉదాహరణలుగా గాంధీ, స్లమ్​ డాగ్​ మిలియనీర్​ వంటి సినిమాలను చూపారు. 

విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్‌లో మాట్లాడిన గౌతమ్ అదానీ.. భారత్ సొంత కథలను రాసుకోవడంలో విఫలం అవడం వల్లనే ఇతరులు వాస్తవాన్ని కార్టూన్ల రూపంలో రాసి లబ్ది పొందిన సందర్భాలున్నయని వాదించారు. దేశం  తన గుర్తింపును ఇతరులు నిర్వహించే విధంగా అనుమతివ్వకూడదని అన్నారు.  భారత్​ తన గొప్పతనాన్ని, గుర్తింపును చెప్పుకునేందుకు సినిమాలు, అడ్వాన్స్​డ్​ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. 

2023 హిండెన్‌బర్గ్ రిపోర్టును ప్రస్తావిస్తూ..అదానీ గ్రూప్ మార్కెట్ విలువను తాత్కాలికంగా 100 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తప్పుడు స్క్రిప్ట్ వ్యాపించడం వల్లే దశాబ్దాల పనిని ఎలా తుడిచిపెట్టగలదో ఈ ఎపిసోడ్ స్పష్టంగా గుర్తు చేస్తుందని అన్నారు గౌతమ్​ అదానీ. ప్రస్తుత ప్రపంచంలో సత్యాన్ని కూడా బిగ్గరగా చెప్పాలని ఈ అనుభవం నాకు నేర్పింది. మౌనం ఇతరులు మీ తలరాతను రాసేందుకు అవకాశం ఇస్తుందని అన్నారు గౌతమ్​ అదానీ. 

►ALSO READ | Viral news: పెళ్లై పదినెలలే.. భర్త చీర కొనివ్వలేదని.. భార్య ఇలా చేసిందేంటీ..

చాలా కాలంగా భారత్​ స్వరం మన స్వంత సరిహద్దులలో దృఢంగా ఉంది.. కానీ వాటి అవతల కూడా మసకబారిందన్నారు. ఆ నిశ్శబ్దంలో ఇతరులు కలం ఎత్తి పక్షపాతంతో నిండిన, వారి సౌలభ్యం ప్రకారం బందీగా భారత్‌ను గీస్తున్నారని అన్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ ,గాంధీ వంటి చిత్రాలను ఉదాహరణగా చూపిస్తూ.. అదానీ భారతీయ కథలను విదేశీ కటకాల్లో ఎందుకు చెప్పబడుతున్నారని ప్రశ్నించారు. మన దుఃఖం వారి దృశ్యంగా మారిందన్నారు. భారతీయ గుర్తింపు సాంస్కృతిక అవుట్‌సోర్సింగ్‌ను అంతం చేయాలని పిలుపునిచ్చారు.