
సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ తన క్రికెట్ కెరీర్ లో 1000 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 1000 వికెట్లు పడగొట్టిన నాలుగో సౌతాఫ్రికా ప్లేయర్ గా నిలిచాడు. రావల్పిండి వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆరు వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్నాడు. హార్మర్ ధాటికి పాకిస్థాన్ తమ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 138 పరుగులకే ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా ముందు కేవలం 68 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ స్వల్ప టార్గెట్ ను సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 1-1 తో సమం చేసింది. తొలి టెస్టులో పాకిస్థాన్ గెలిచిన సంగతి తెలిసిందే.
4 వికెట్ల నష్టానికి 94 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ 44 పరుగుల తేడాలో తమ చివరి 6 వికెట్లను కోల్పోయింది. ఆరంభములోనే హార్మర్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత రిజ్వాన్ కూడా తక్కువ స్కోర్ కే ఔట్ కావడంతో పాకిస్థాన్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 333 పరుగులు చేస్తే.. సౌతాఫ్రికా 404 పరుగులు చేసి 71 పరుగులు ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 138 పరుగులకు ఆలౌట్ కాగా.. 68 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా ఛేజ్ చేసి గెలిచింది. మహరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. ముత్తుస్వామికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
మ్యాచ్ టర్న్ చేసిన ముత్తుస్వామి, రబడా:
4 వికెట్ల నష్టానికి 185 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలోనే వికెట్ కీపర్ వెర్రెన్ వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన స్టబ్స్ 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరాడు. మార్కో జాన్సెన్, హార్మర్ కూడా తక్కువ పరుగులకే ఔటై నిరాశపరిచారు. దీంతో సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఈ దశలో అసలు ఆట మొదలయింది. పాక్ బౌలర్లను విసిగిస్తూ ముత్తుస్వామి, మహారాజ్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
9 వికెట్ కు 71 పరుగులు జోడించి జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించారు. ఎట్టకేలకు మహరాజ్ వికెట్ తీసుకున్న పాకిస్థాన్ ఊపిరి పీల్చుకుంది. అయితే 11 వ స్థానంలో వచ్చిన రబడా పాకిస్థాన్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. బౌండరీల మోత మోగిస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సఫారీలకు ఆధిక్యాన్ని అందించాడు. ఓవరాల్ గా 61 బంతుల్లో 71 పరుగులు చేసిన ఈ స్పీడ్ స్టార్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
Simon Harmer is running through Pakistan's second innings in Rawalpindi, and gets to 1000 first-class wickets as well 👏 #PAKvSA pic.twitter.com/hiRJbEoGWz
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2025