ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్.. సింగపూర్ కంపెనీకి!

ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్.. సింగపూర్ కంపెనీకి!
  • డీపీ ఆర్కిటెక్ట్స్​కు అప్పగింత.. టెండర్లలో లోయెస్ట్​ బిడ్​
  • 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సిటీ మాస్టర్​ ప్లాన్​
  • 30 వేల ఎకరాల్లో అభివృద్ధి.. 
  • 13 వేల ఎకరాల్లో పరిశ్రమలు, రెసిడెన్షియల్​ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లు
  • లైఫ్​సైన్సెస్​, ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రిక్​ వెహికల్స్​ జోన్స్‌‌‌‌‌‌‌‌కు ప్రయారిటీ

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్​ సిటీ మాస్టర్​ప్లాన్​ బాధ్యతలను సింగపూర్​ కంపెనీకి ప్రభుత్వం అప్పగించినట్టు తెలుస్తున్నది. మాస్టర్​ప్లాన్​కోసం గ్లోబల్​ టెండర్లను పిలువగా.. ఆరు సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయి. అందులో సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్స్​ అనే సంస్థ లోయెస్ట్​ బిడ్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. 

దీంతో ఆ సంస్థకే మాస్టర్​ప్లాన్​ తయారీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించినట్టు సమాచారం. 765 చదరపు కిలోమీటర్ల మేర ఫ్యూచర్​సిటీకి ఆ సంస్థ మాస్టర్​ ప్లాన్​ తయారు చేయనున్నది. 9 నెలల్లో మాస్టర్​ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను తయారు చేసి ఇచ్చేలా సంస్థకు బాధ్యతలు అప్పగించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. 

తొలి దశలో భాగంగా 30 వేల ఎకరాలపై మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేయనున్నారు. అందులో భాగంగా వేటికి ఎంత ల్యాండ్​ వినియోగించాలి.. మౌలికవసతుల అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యాలను మాస్టర్​ప్లాన్‌‌‌‌‌‌‌‌లో పొందుపరచనున్నారు. మొత్తంగా 30 వేల ఎకరాల్లో 13 వేల ఎకరాలను మౌలికవసతులు, పారిశ్రామిక అవసరాల అభివృద్ధికి వాడుకోబోతున్నారు. 

లైఫ్​సైన్సెస్​, ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం..

డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా లైఫ్​సైన్సెస్​, ఎలక్ట్రానిక్స్​ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తున్నది. 13 వేల ఎకరాల్లో సింహభాగం లైఫ్​సైన్సెస్‌‌‌‌‌‌‌‌కు కేటాయించనున్నారు. 4 వేల ఎకరాల్లో లైఫ్​సైన్సెస్​ హబ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత 2,177 ఎకరాల్లోఎలక్ట్రానిక్స్​ అండ్​ అడ్వాన్స్డ్​ మాన్యుఫ్యాక్చరింగ్​ జోన్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఎలక్ట్రిక్​ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు ట్రెండ్​, డిమాండ్​ పెరగడంతో దానికీ ఇంపార్టెన్స్​ ఇచ్చారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​, ఎనర్జీ పార్క్​ కోసం దాదాపు 2 వేల ఎకరాలు కేటాయించినట్టు తెలిసింది.

 ఏఐ సిటీ కోసం 400 ఎకరాలు, డేటా సెంటర్​ హబ్​ కోసం 310 ఎకరాలు, హెల్త్​ సిటీకి 594 ఎకరాలు, ఎడ్యుకేషన్​ అండ్​ యూనివర్సిటీ డిస్ట్రిక్ట్​ కోసం 255 ఎకరాల కేటాయింపులు చేసినట్టు చెబుతున్నారు. వాటితోపాటు రెసిడెన్షియల్​ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ల అభివృద్ధి కోసం 2,477 ఎకరాలను కేటాయించారు. మిక్స్డ్​యూజ్​పర్పస్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్, ఫర్నీచర్​ మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌కు కూడా భూములు కేటాయించినట్టు చెబుతున్నారు. 

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్​ కారిడార్లు, యుటిలిటీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్స్, సోషల్​ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, వాణిజ్య ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలను మాస్టర్​ ప్లాన్‌‌‌‌‌‌‌‌లో పొందు పరచనున్నారు. ప్రస్తుతం ఎఫ్​సీడీఏ ప్రాంతం వివిధ హద్దుల్లోకి వస్తున్నది. ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాలు హెచ్ఎండీఏ, మధ్యభాగంలో హైదరాబాద్​ ఫార్మా సిటీ ఏరియా ఉంటున్నది. దక్షిణ భాగం గ్రామీణ ప్రాంతాలే ఉన్నాయని చెబుతున్నారు. మాస్టర్​ ప్లాన్‌‌‌‌‌‌‌‌లో ఫ్యూచర్​ సిటీ అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికను పొందుపరుస్తారని అధికారులు చెబుతున్నారు.