బూస్టర్ షాట్ వేసుకున్న ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్

బూస్టర్ షాట్ వేసుకున్న ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్

ఒమిక్రాన్ వేరియంట్ పై అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్ తో జాగ్రత్తగా ఉండాలని, కరోనా రూల్స్ తప్పక పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికీ ఒమిక్రాన్ సోకుతుండటం గమనార్హం. తాజాగా సింగపూర్ లో బూస్టర్ షాట్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులుకు కొవిడ్ సోకింది. ఎయిర్ పోర్టులో పని చేసే 24 ఏళ్ల మహిళా వర్కర్ కు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. సింగపూర్ లో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు ఇదేనని ఆ దేశ హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన మరో వ్యక్తి రీసెంట్ గా జర్మనీ నుంచి సింగపూర్ కు వచ్చాడని మినిస్ట్రీ పేర్కొంది. వీళ్లిద్దరూ వ్యాక్సిన్ మూడో డోసు (బూస్టర్ షాట్) కూడా వేసుకున్నారని.. అయినా వీరికి ఒమిక్రాన్ సోకిందని స్పష్టం చేసింది. అందుకే వ్యాక్సిన్ తీసుకున్నామని అలసత్వంతో ఉండకుండా.. మాస్కు కట్టుకోవడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.