సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే పవర్ ఫుల్.. తొలిసారిగా టాప్–10 నుంచి దిగజారిన అమెరికా.. ఇండియా స్థానం ఎక్కడంటే

సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే పవర్ ఫుల్.. తొలిసారిగా టాప్–10 నుంచి దిగజారిన అమెరికా.. ఇండియా స్థానం ఎక్కడంటే
  • 85వ స్థానంలో నిలిచిన భారత్.. పడిపోయిన ర్యాంకు 
  • హెన్లీ పాస్ పోర్టు  ఇండెక్స్  విడుదల 

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ కలిగిన దేశాల జాబితాను హెన్లీ పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ అనే సంస్థ విడుదల చేసింది. ప్రయాణికులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఆధారంగా ఈ  ఇండెక్స్ ను ప్రచురించింది. ఈ జాబితాలో సింగపూర్ మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. సింగపూర్ పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ తో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. 

గతేడాది ఈ జాబితాలో 80వ స్థానంలో ఉన్న ఇండియా.. తాజాగా 85వ స్థానానికి పడిపోయింది. గతేడాది మన దేశ పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉన్న వారు 62 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించే అవకాశం ఉండేది. అది ఇప్పుడు కేవలం 57 దేశాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ కూడా దిగజారింది. తాజా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో అమెరికా12వ స్థానానికి పడిపోయింది. 

మలేసియాతో కలిసి యూఎస్ 12వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో దక్షిణ కొరియా (190), మూడో స్థానంలో జపాన్ (189) ఉన్నాయి. జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌‌‌‌‌‌‌‌పోర్టులతో 188 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించొచ్చు. ఇక ఐదో స్థానంలో ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్ దేశాలు ఉన్నాయి.