
హైదరాబాద్, వెలుగు: చత్తీస్‌గఢ్‌లో ఉన్న జాతీయ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఎన్‌ఎస్‌పీసీఎల్)కు ఈ ఆర్థిక సంవత్సరం 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అగ్రిమెంట్‌పై సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్‌డీఎం సుభాని సమక్షంలో జీఎం ఎన్‌వీ రాజశేఖర్ రావు..అలాగే, ఎన్‌ఎస్‌పీసీఎల్ సీఈవో దివాకర్ కౌశల్, జనరల్ మేనేజర్లు నీల్ కమల్, పలాశ్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో సింగరేణి మార్కెటింగ్ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీనివాసరాజు, సురేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం, సింగరేణి తన గనుల నుంచి నాణ్యమైన బొగ్గును ఎన్‌ఎస్‌పీసీఎల్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు సరఫరా చేయనుంది. అగ్రిమెంట్ వల్ల సింగరేణి సంస్థ ఆదాయం పెరగటంతోపాటు దేశంలో విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని బలోపేత అవుతుందని అధికారులు తెలిపారు. సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం మాట్లాడుతూ.. “ఈ ఒప్పందం సింగరేణి బొగ్గు ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని తెలియజేస్తున్నది. ఎన్‌ఎస్‌పీసీఎల్‌తో జరిగిన ఒప్పందం దేశఅవసరాలను తీర్చడంలో ముఖ్యమైన అడుగు” అని పేర్కొన్నారు.
ఈ చర్య సింగరేణి ఉత్పాదకతను పెంచడంతో పాటు తెలంగాణలో ఉపాధి అవకాశాలను కల్పించడంలోనూ దోహదపడుతుందని అంచనా. ఎన్‌ఎస్‌పీసీఎల్ అనేది ఎన్టీపీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ. ఇది చత్తీస్‌గఢ్‌లోని దుర్గాపూర్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నది.