భూసేకరణలో నిబంధనలు పాటించాలి

భూసేకరణలో నిబంధనలు పాటించాలి
  • కలెక్టర్లతో సమీక్షలో సింగరేణి డైరెక్టర్ 

జైపూర్, వెలుగు: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి డైరెక్టర్(ఫా, వెల్ఫేర్) గౌతమ్ పొట్రు సూచించారు. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆఫీస్​లో మంచిర్యాల,పెద్దపల్లి జిల్లా కలెక్టర్లు కుమార్ దీపక్, కోయ శ్రీహర్షతో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనే జర్లు, ఎస్టేట్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్​ మాట్లాడుతూ.. భూ యజమానులు, సింగరేణి సంస్థ సమన్వయంతో వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ నిర్వహించాలన్నారు. భూసేకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు.