
-
డీఎంఎస్టీ కింద 33 జిల్లాలకు రూ.146.70 కోట్లు రిలీజ్
నిర్మల్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో సౌలతుల కల్పనకు సింగరేణి సంస్థ ద్వారా జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్( డీఎంఎఫ్ టీ) కింద రాష్ట్రంలోని 33 జిల్లాలకు 146.70 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నిధులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిధులను పాఠశాలల్లో సివిల్ వర్క్స్, పరిశుభ్రత చర్యలతో పాటు టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ, మొక్కల పెంపకం, పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత చర్యలకు వినియోగించాల్సి ఉంది.
జిల్లా కలెక్టర్ పనుల పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వుల్లో వివరించారు.