కొత్త గనుల కోసం సమ్మెలో పాల్గొనండి : జేఏసీ లీడర్లు

కొత్త గనుల కోసం సమ్మెలో పాల్గొనండి : జేఏసీ లీడర్లు

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కొత్త గనులు రావడం కోసం గని కార్మికులు ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన ఒకరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు పిలుపునిచ్చారు. సోమవారం జీడీకే 5 ఓపెన్​కాస్ట్​పై జరిగిన గేట్​మీటింగ్‌‌లో లీడర్లు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్​ చేశారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌‌కుమార్‌‌‌‌, టీబీజీకేఎస్‌‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఐఎన్టీయుసీ జాయింట్ సెక్రటరీ గడ్డం కృష్ణ, సీఐటీయూ డిప్యూటీ జనరల్​ సెక్రటరీ నాగరాజ గోపాల్, ఇఫ్టూ అధ్యక్షుడు కె.విశ్వనాథ్, లీడర్లు పాల్గొన్నారు. 

కోనరావుపేట/కోరుట్ల, వెలుగు: ఈనెల 20 న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. సమ్మె పోస్టర్‌‌‌‌ను హమాలీ సంఘ నాయకులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. కోరుట్లలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.