సింగరేణి నయా టార్గెట్ 72 మిలియన్ టన్నులు

సింగరేణి నయా టార్గెట్ 72 మిలియన్ టన్నులు
  • ఏరియాల వారీగా బొగ్గు టార్గెట్ల కేటాయింపు
  •     మూడు కొత్త గనులపై ఆశలు
  •     వచ్చే ఐదేళ్లలో 90 మిలియన్ టన్నుల ఉత్పత్తే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా ప్లాన్‌‌‌‌‌‌‌‌

కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌, వెలుగు : సింగరేణి సంస్థ 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 70.02 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు సృష్టించింది. ఆరేళ్ల తర్వాత  లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించడంతో ఆఫీసర్లు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 2024–25 సంవత్సరంలో 72 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ఈ మేరకు ఆయా ఏరియాలకు టార్గెట్లను కేటాయించి ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చేరుకునేందుకు ఈ సంవత్సరం కొత్తగా మూడు ఓసీపీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఏరియాల వారీగా టార్గెట్‌‌‌‌‌‌‌‌ కేటాయింపు

ఈ సంవత్సరం సింగరేణి సంస్థ 72 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకొని, ఈ మేరకు ఆయా ఏరియాలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. కొత్తగూడెం ఏరియా టార్గెట్‌‌‌‌‌‌‌‌గా 14.95 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నులు కేటాయించగా, ఇల్లందు ఏరియాకు 4.13, మణుగూరుకు 12.76, రామగుండం-1కు 4.95, రామగుండం-2 ఏరియాకు 9.87, రామగుండం-3 ఏరియాలో 6.25 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా నిర్ణయించింది. అలాగే అడ్రియాల లాంగ్‌‌‌‌‌‌‌‌వాల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో 0.52 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నులు, బెల్లంపల్లి ఏరియాలో 3.85, మందమర్రి ఏరియా 3.46, శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో 6.31, భూపాలపల్లి ఏరియాలో 4.96 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించింది.

ఐదేళ్లలో 90 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల ఉత్పత్తి సాధించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌

గత ఆర్థికసంవత్సరంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అనుకున్న మేరకు 70.02 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణి 69.86 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నులను రవాణా చేసింది. ప్రస్తుత సంవత్సరంలో 72 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల ఉత్పత్తిని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్న సంస్థ రానున్న ఐదేళ్లలో 90 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల ఉత్పత్తి సాధించేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఇందులో భాగంగా 2024–-25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియాలోని వీకే- 7 ఓసీపీ, ఇల్లందులోని జేకే ఓసీపీ, ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్‌‌‌‌‌‌‌‌ ఓసీపీల నుంచి బొగ్గు ఉత్పత్తికి ఏర్పాట్లు చేసుకుంది. 

వీకే, జేకే ఓసీపీల నుంచి ఐదేసి మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నులే కాకుండా, నైనీ బ్లాక్‌‌‌‌‌‌‌‌ నుంచి 10 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల ఉత్పత్తి సాధించాలని నిర్ణయించింది. 2025–26లో బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీ, రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌లోని జీడీకే 10 ఓసీపీ ద్వారా మరో ఐదు మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నులు, 2026–-27లో బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీపీ, మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ఓసీపీ, శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్‌‌‌‌‌‌‌‌కే 5, ఆర్‌‌‌‌‌‌‌‌కే 6 ఓసీపీల ద్వారా రెండేసి మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నులతొ పాటు, పీవీఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ఓసీపీ ద్వారా ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది సింగరేణి టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. దీని ద్వారా 2028–29 నాటికి 90 మిలియన్‌‌‌‌‌‌‌‌ టన్నుల టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేరుకునేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది.