
గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సమానంగా సింగరేణి ఆఫీసర్లకు జీతాలు ఇవ్వాలని కోల్మైన్స్ఆఫీసర్స్ అసోసియేషన్సింగరేణి బ్రాంచ్ప్రతినిధులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, సహాయ మంత్రి సతీశ్చంద్ర దూబేకు విజ్ఞప్తి చేశారు. గురువారం వారు హైదరాబాద్లో కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఆఫీసర్లకు వర్తింపజేసినట్టుగా సింగరేణి ఆఫీసర్లకు గ్రేడ్లను కల్పించాలని కోరారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. సింగరేణి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుళ్లినట్టు చెప్పారు. కోల్ఇండియా లిమిటెడ్అఫెక్స్కమిటీ జనరల్సెక్రటరీ డి.సాహూ, సింగరేణి బ్రాంచ్ ప్రెసిడెంట్లక్ష్మిపతి గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్, ఏరియా ప్రెసిడెంట్ కె.వెంకటేశ్వర్ రెడ్డి, సెక్రటరీ హరిప్రసాద్ ఉన్నారు.