
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రిటైర్డ్కార్మికులకు కనీస పెన్షన్ రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సోమవారం గోదావరిఖని సింగరేణి స్టేడియం వద్ద రిటైర్డ్ కార్మికులు సమావేశమై ఆందోళన చేపట్టారు.
27 ఏండ్లుగా పెంపుదలకు నోచుకోని కోల్‌మైన్స్ పెన్షన్‌ను కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ వెంటనే చెల్లించాలని, సీపీఆర్ఎంఎస్ స్కీమ్ కింద వైద్య సౌకర్యం కోసం రిటైర్డ్ ఉద్యోగులకు కూడా రూ.25 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో మారుపేర్లను సరి చేయాలని, సంస్థలో కొత్తగా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ప్రారంభించాలని, అర్హులైన రిటైర్డ్ఉద్యోగులకు వైట్ రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, 250 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సింగరేణి ఆల్రిటైర్డ్ఎంప్లాయీస్వెల్ఫేర్అసోసియేషన్ లీడర్లు ఎండీ రఫీక్, కొమ్ముల సంజీవ్, షేక్ కలీం అహ్మద్, సర్వర్ పాష, నగునూరి శంకర్, సమ్మయ్య, కొమురయ్య, రాజిరెడ్డి, మొగిలి పాల్గొన్నారు.