జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి : జీఎం లలిత్ కుమార్

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి : జీఎం లలిత్ కుమార్

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో జూన్​ నెలలో 94 శాతం బొగ్గు వెలికితీసినట్టు జీఎం డి.లలిత్​ కుమార్​ తెలిపారు. మంగళవారం తన ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ ఆర్జీ 1 ఏరియాలో ఓపెన్​కాస్ట్–5 ప్రాజెక్ట్​ 106 శాతం సాధించి ఉత్పత్తిలో ముందున్నదన్నారు. సంక్షేమంలో భాగంగా సింగరేణి ప్రభావిత గ్రామాల్లో 23 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు. రూ.15 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు.

కార్మిక కుటుంబాలకు శుద్ధమైన వాటర్​ అందించేందుకు రాపిడ్ గ్రావిటీ ప్లాంట్​నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు వెల్లడించారు. ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని, సింగరేణికి సంబంధించిన అంశాలు ఈ సమ్మె డిమాండ్లలో ఏవీ లేవన్నారు. మీటింగ్​లో ఆర్జీ వన్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రవీందర్ రెడ్డి, అధికారులు ఆంజనేయులు, ఆంజనేయప్రసాద్, శ్రీనివాస్, జితేందర్ సింగ్, వరప్రసాద్, వీరారెడ్డి, హనుమంత్ రావు, వేణు, పాల్గొన్నారు.