భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కార్మికులకు రూ.1.20 కోట్ల ప్రమాదబీమాతో పాటు సహజ మరణానికి రూ. 10 లక్షల ఉచిత బీమా చెల్లింపు కోసం సింగరేణి సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ మేరకు కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో అగ్రిమెంట్‌పై ఇరు సంస్థల ఆఫీసర్లు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగిన ప్రతి సింగరేణి ఉద్యోగి ఈ స్కీమ్‌కు అర్హుడు అవుతారని జీఎం వెల్ఫేర్ జీవీ.కిరణ్‌కుమార్ తెలిపారు.
అనుకోని ఘటనలు జరిగిన సమయంలో కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ఈ అగ్రిమెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజినల్ మేనేజర్ రిషికేశ్ రంజన్‌కుమార్, సింగరేణి జీఎం పర్సనల్ కవితానాయుడు, జీఎంలు మురళీధర్‌రావు, ఎన్.చక్రవర్తి పాల్గొన్నారు.

