కార్మికులకు సింగరేణి సంస్థ (SCCL) శుభవార్త చెప్పింది. సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులకు సహజ మరణానికి కూడా బీమా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తో గురువారం ( 2026, ఏప్రిల్ 23) ఒప్పందం కుదుర్చుకుంది. లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఉద్యోగులకు పది లరూ.10 లక్షల బీమా ఇవ్వనుంది.
సింగరేణి తీసుకున్న ఈ నిర్ణయంతో 40 వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు 10 లక్షల రూపాయల బీమా అందించనున్నారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో ఏప్రిల్ 23న ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ కొత్త నిర్ణయంతో సహజ మరణానికి కూడా బీమా అందించనున్నారు. గతంలో కేవలం ప్రమాద బీమా మాత్రమే ఉద్యోగులకు అందేది.
►ALSO READ | ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ.. చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి : నిర్మల్ జిల్లాలో ఊహించని ఘటన
ఎస్బీఐ ఇప్పటికే సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమాను అందిస్తోంది. 2021–22 నుంచి ఉద్యోగులకు ప్రమాద బీమా వర్తిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం ప్రమాద బీమాను కోటి రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే.
మరోవైపు ఎస్బీఐ బ్యాంకు సింగరేణి కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తోంది. కార్మికుల కుటుంబాలకు రూ.8,906 తో 50 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. దీనికి తోడు కోటి రూపాయల ప్రమాద బీమా కూడా అందిస్తోంది. ప్రమాద బీమాను రిటైర్డ్ ఉద్యోగులకు అందిస్తున్నారు. పదవీ విరమణ పొందిన కార్మికులకు 70 ఏండ్ల వరకు 30 లక్షల బీమా అందుతోంది.

