డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లకు సింగరేణి స్పెషల్ డ్రైవ్..నవంబర్ 3 నుంచి 28 వరకు క్యాంపుల ఏర్పాటు

డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లకు సింగరేణి స్పెషల్ డ్రైవ్..నవంబర్ 3 నుంచి  28 వరకు క్యాంపుల ఏర్పాటు
  • తొలగనున్న సంస్థ రిటైర్డు ఎంప్లాయీస్ కష్టాలు 
  •  సీపీఆర్ఎంఎస్ రెన్యువల్​కూ పెన్షనర్ల డిమాండ్​

కోల్​బెల్ట్, వెలుగు :  పెన్షనర్లు ఈజీగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందించేందుకు సింగరేణి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది.  సర్టిఫికెట్ ను ఈజీగా, ఫ్రీగా అందించేందుకు క్యాంపుల ఏర్పాటు చేయాలని సీఎంపీఎఫ్​ఆఫీసర్లు నిర్ణయించారు. ఇందుకు డిజిటల్​లైఫ్​సర్టిఫికెట్(డీఎల్​సీ)- 4.0 పేరుతో క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పెన్షనర్లకు డిజిటల్​లైఫ్​సర్టిఫికెట్​పైనా అవగాహన కల్పిస్తారు. 

ఇకముందు లైఫ్ సర్టిఫికెట్లకు ఇబ్బందులు పడకుండా, నేరుగా డీఎల్​సీ  అందించే వెసులుబాటు పెన్షనర్లకు కలగనుంది. నవంబర్ లోపు లైఫ్ సర్టిఫికెట్లు అందించాలని గోదావరిఖని కోల్​మైన్స్​ప్రావిడెంట్​ఫండ్​(సీఎంపీఎఫ్​) రీజినల్​కమిషనర్​హరి పచౌరీ సూచించారు.  సింగరేణి వ్యాప్తంగా 84,530 మంది పెన్షనర్లు ఉండగా.. సీఎంపీఎఫ్​నెలకు సుమారు రూ.80కోట్ల వరకు పెన్షన్ అందిస్తోంది.​ 

నవంబర్ లో అవేర్ నెస్ క్యాంపులు 

వచ్చే నవంబర్​లో 3,4 తేదీల్లో రామగుండం--–1 ఏరియా, 6,7 తేదీల్లో రామగుండం- –-2 ఏరియా, 10,11 తేదీల్లో  రామగుండం–--3 ఏరియా, సీఎంపీఎఫ్ఓ, ఎన్ఈడీపీసీ, హైదరాబాద్​లో ప్రత్యేక అవగాహన క్యాంపులను నిర్వహించనున్నారు. అదే నెల12,13 తేదీల్లో శ్రీరాంపూర్​ఏరియా, 17,18 తేదీల్లో మందమర్రి ఏరియా, 19,20 తేదీల్లో భూపాలపల్లి ఏరియా, 24,25 తేదీల్లో బెల్లంపల్లి ఏరియా -కమ్​-గోలేటీ ఏరియా, 26న రామగుండం–--1 ఏరియా వీర్లపల్లిలోని ఈశ్వరకృప వృద్ధాశ్రమం వద్ద ఏర్పాటు చేయనున్నా రు. 

త్వరలోనే క్యాంపుల స్థలాలను సీఎంపీఎఫ్​ఆఫీసర్లు వెల్లడించనున్నారు. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అందించేందుకు పీపీఓ కాపీ, ఆధార్​కార్డు, బ్యాంక్​ పాస్​బుక్, ఆధార్​లింక్డ్​ మొబైల్​నంబర్​ను అందించాల ని ఆఫీసర్లు సూచిస్తున్నారు. గోదావరిఖని సీఎంపీఎఫ్​ రీజినల్​ఆఫీస్​పరిధిలో సుమారు70 వేల మంది పెన్షనర్లు ఉండగా..వీరికి ప్రత్యేక డీఎల్ సీ క్యాంపులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి.       

 పెన్షనర్లకు  అవగాహన లేకపోగా..

సింగరేణి  పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను  ఏటా నవంబర్, డిసెంబర్​నెలల్లో సీఎంపీఎఫ్(కోల్​మైన్స్​ప్రావిడెంట్​ఫండ్​ఆర్గనైజేషన్​)​కు అందించాల్సి ఉంటుంది. ఇవ్వకుంటే పెన్షన్​నిలిచిపోతుంది.  సింగరేణిలో 5,058 మంది పెన్షనర్లు, కుటుంబసభ్యులు ఉన్నట్లు గతేడాది ఆఫీసర్లు గుర్తించారు. 

రిటైర్డు ఉద్యోగుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులు కావడంతో మీసేవా, ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి ఆఫ్​లైన్​, ఆన్​లైన్​లో లైఫ్ సర్టిఫికెట్లు అందించడంపై అవగాహన తక్కువే. కొందరు సొంతూళ్లలో ఉంటుండగా.. వీరికి  సర్టిఫికెట్ల అందజేతపై సమాచారం ఉండటంలేదు. లైఫ్ సర్టిఫికెట్ ఇస్తున్నా కానీ, కొన్నిసార్లు సంస్థల పేర్లు చెప్పకపోతుండడంతో పెన్షన్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.  

 మెడికల్ కార్డు రెన్యూవల్​కు చాన్స్ ఇవ్వాలి 

 సింగరేణి జారీ చేసిన కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడికేర్ స్కీమ్ (సీపీఆర్ఎంఎస్) మెడికల్ కార్డు రెన్యూవల్ కూడా నవంబర్​లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రిటైర్డ్ ఉద్యోగి తన జీవిత భాగస్వామితో కలిసి  మీసేవా,ఇంటర్నెట్ సెంటర్లలో అప్లై చేసుకోవాలి. కార్డు రెన్యూవల్​కు దంపతుల ఆధార్​కార్డులు, జాయింట్ బ్యాంక్​పాస్​బుక్​, పీపీఓ కాపీ, మెడికల్​ కార్డు అందించాలి. పెన్షన్ కు, మెడికల్​కార్డు రెన్యూవల్​కు ఒకే విధమైన డాక్యుమెంట్లను  ఇవ్వాలి. 

నవంబర్​లో సీఎంపీఎఫ్​ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే డీసీఎల్​క్యాంపుల వద్ద  సిబ్బంది ని ఏర్పాటు చేసి మెడికల్​కార్డు రెన్యూవల్​కు సర్టిఫికెట్లు తీసుకునే వెసులుబాటు  కల్పించాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి క్యాంపునకు వెళ్లే రిటైర్డు ఎంప్లాయీస్ ఒకే రోజు పెన్షన్, మెడికల్​కార్డు రెన్యూవల్​కు సర్టిఫికెట్లు అందించే వీలుంటే  సమయం కలిసివస్తుందని పేర్కొంటున్నారు. ఆ దిశగా సింగరేణి యాజమాన్యం  ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

 మెడికల్​కార్డు రెన్యువల్ చేయాలి

సింగరేణి స్పెషల్​డ్రైవ్​క్యాంపుల ఏర్పాటు రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నవంబర్​లోనే కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడికేర్ స్కీమ్ (సీపీఆర్ఎంఎస్) మెడికల్ కార్డ్ రెన్యువల్ కోసం రిటైర్డ్ ఉద్యోగితో పాటు జీవిత భాగస్వామి కూడా లైఫ్ సర్టిఫికెట్ అందించాలి. సీఎంపీఎఫ్​ క్యాంపుల్లో సీపీఆర్ఎంఎస్​కార్డు రెన్యువల్​కు సంబంధించి తగు ఏర్పాట్లు చేస్తే రిటైర్డు ఎంప్లాయీస్ కు వెసులుబాటుగా ఉంటుంది. - ఆళవందార్ వేణు మాధవ్,ఉప ప్రధాన కార్యదర్శి, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్