విస్తరణ దిశగా సింగరేణి అడుగులు

విస్తరణ దిశగా సింగరేణి అడుగులు
  • విండ్‌‌‌‌ పవర్‌‌‌‌ ఉత్పత్తిపై ఫోకస్‌‌‌‌
  • ఇతర రాష్ట్రాల్లోనూ సోలార్‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు
  • ఇప్పటికే ప్రభుత్వాని రిపోర్ట్‌‌‌‌ పంపిన సంస్థ
  • పార్లమెంట్‌‌‌‌ రిజల్ట్‌‌‌‌ తర్వాత పర్మిషన్‌‌‌‌ వచ్చే చాన్స్‌

గోదావరిఖని, వెలుగు : రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్‌‌‌‌, సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌ జనరేషన్​ చేస్తున్న తొలి ప్రభుత్వ రంగసంస్థగా పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థ ప్రస్తుతం విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇల్లందు జేకే ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌లో పంప్డ్​స్టోరేజీ హైడ్రో పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌తో పాటు సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ మట్టి గుట్టలపై విండ్‌‌‌‌ పవర్‌‌‌‌ ఉత్పత్తి చేసేందుకు ఫోకస్‌‌‌‌ చేసింది. ఈ విషయాలపై సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్‌‌‌‌ ఇచ్చారు. పార్లమెంట్‌‌‌‌ రిజల్ట్‌‌‌‌ అనంతరం ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 

ఇప్పటికే థర్మల్, సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌ ఉత్పత్తి

ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థ కేవలం మొదట్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాపైనే దృష్టి సారించింది. 2016లో జైపూర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లో రెండు యూనిట్ల ద్వారా 1,200 మెగావాట్ల థర్మల్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ ఉత్పత్తినిప్రారంభించింది. ఆ తర్వాత మొదటి దశలో తొమ్మిది లొకేషన్లలో 13 సోలార్‌‌‌‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి 235 మెగావాట్ల విద్యుత్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రెండో దశలో భాగంగా 232 మెగావాట్ల సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇందులో భాగంగా మందమర్రిలో 67.5 మెగావాట్ల ప్లాంట్, రామగుండం పరిధిలోని ఓవర్‌‌‌‌ బర్డెన్‌‌‌‌ డంప్‌‌‌‌లో 37 మెగావాట్ల ప్లాంట్, శ్రీరాంపూర్‌‌‌‌ ప్రాంతంలో 27.5 మెగావాట్ల ప్లాంట్‌‌‌‌, కొత్తగూడెంలో 32.5 మెగావాట్ల ప్లాంట్, జైపూర్‌‌‌‌ సింగరేణి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఆవరణలో 32.5 మెగావాట్ల ప్లాంట్, ఇల్లందులో 37.5 మెగావాట్ల ప్లాంట్‌‌‌‌ను నిర్మాణం చేయనున్నారు. ఇక జైపూర్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను విస్తరించడంలో భాగంగా రెండో దశలో 800 మెగావాట్ల మూడవ యూనిట్‌‌‌‌ను నిర్మించేందుకు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ప్లాంట్‌‌‌‌ ఆవరణలోనే రూ.5,900 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. 

రిజర్వాయర్లపై ఫ్లోటింగ్‌‌‌‌ సోలార్‌‌‌‌ ప్లాంట్లు

వ్యాపార విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లో సోలార్‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలపై సింగరేణి సంస్థ అధ్యయనం చేస్తోంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గల రిజర్వాయర్లపై వెయ్యి మెగావాట్ల ఫ్లోటింగ్‌‌‌‌ సోలార్‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా సింగరేణి సంస్థ సిద్ధమైంది.
 
జేకే ఓసీపీలో పంప్డ్‌‌‌‌ స్టోరేజీ హైడ్రో పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌

స్థిరమైన ఇంధన వనరులను వినియోగించుకొని ముందుకు సాగాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు సింగరేణి సంస్థ కార్యాచరణను రూపొందించుకుంది. ఇందులో భాగంగా ఇల్లందు సమీపంలోని జేకే ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ వద్ద అనుకూలంగా ఉండడంతో పంప్డ్​స్టోరేజ్‌‌‌‌ హైడ్రో పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఏర్పాటుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రెడీ చేసింది. కింది ప్రాంతంలో డ్యామ్‌‌‌‌ను నిర్మించి అందులో స్టోర్‌‌‌‌ అయిన నీటిని పంప్‌‌‌‌ల ద్వారా ఎత్తైన ప్రాంతానికి పంపించి తిరిగి కిందకు తీసుకువస్తూ టర్బైన్లను తిప్పడం వల్ల పవర్‌‌‌‌ జనరేట్‌‌‌‌ అవుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇలా పంప్డ్‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌ హైడ్రో పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను నెలకొల్పడానికి సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇదే విషయంపై సంస్థ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక సైతం అందజేశారు.‌‌‌

విండ్‌‌‌‌ పవర్‌‌‌‌ ఉత్పత్తికి చర్యలు

రాష్ట్రంలో విండ్‌‌‌‌ పవర్‌‌‌‌ (పవన విద్యుత్) ఉత్పత్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటు వైపు కూడా అడుగులు వేసేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ల వద్ద బొగ్గు వెలికితీత కోసం తవ్వి తీసిన మట్టి గుట్టలపై విండ్‌‌‌‌ పవర్‌‌‌‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చని సింగరేణి సంస్థ భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలుసైతం రెడీ చేసుకుంది. ఎన్నికల కోడ్‌‌‌‌ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్‌‌‌‌ తీసుకుని విస్తరణ దిశగా అడుగులు వేసేందుకు సంస్థ ఎదురుచూస్తోంది.