
గోదావరిఖని, వెలుగు : సింగరేణివ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవం నిర్వహిస్తున్నట్టు సీఎండీ ఎన్. బలరామ్ నాయక్ తెలిపారు. ఆదివారం గోదావరిఖనిలో సింగరేణి వనమహోత్సవంలో భాగంగా 500 మొక్కలు నాటారు. స్థానిక జీడీకే –5 ఓసీపీ సమీపంలోని సివిల్డిపార్ట్మెంట్ఫిల్టర్ బెడ్ఆవరణలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఎండీ బలరామ్నాయక్ మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే భావితరాలకు ఎంతో మేలు చేసిన వారమవుతామని పేర్కొన్నారు.
మొక్కలను నాటే కార్యక్రమాన్ని సీఎండీ ప్రత్యేకంగా తీసుకున్నారని, ఇప్పటి వరకు19,570 మొక్కలను నాటి ఆదర్శంగా నిలిచారని సింగరేణి ఆర్జీ- 1 ఏరియా జీఎం డి.లలిత్‌కుమార్ తెలిపారు. 2019లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు 40 చిట్టడవులను తయారు చేసినట్టు తెలిపారు. సీఎంఓఎఐ అధ్యక్షుడు బి.మల్లేశ్, ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సేవా అధ్యక్షురాలు అనిత, ఆఫీసర్లు ఆంజనేయ ప్రసాద్, కర్ణ, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.