- మైన్స్, డిపార్ట్మెంట్లలో నల్లబ్యాడ్జీలతో నిరసన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి డే సెలబ్రేషన్స్ను కంపెనీలో గుర్తింపుసంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బహిష్కరించింది. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్తో పాటు సింగరేణి వ్యాప్తంగా మంగళవారం కంపెనీ ఆవిర్భావ వేడుకలను యాజమాన్యం నిర్వహించింది. వేడుకల విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మైన్స్, డిపార్ట్మెంట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నామని గుర్తింపు సంఘం నేతలు పేర్కొన్నారు.
వేడుకలను జీఎం ఆఫీస్లకే పరిమితం చేయడంతో పాటు ఆర్థిక ఆంక్షలు విధించడం దారుణమన్నారు. సింగరేణి డే సందర్భంగా కంపెనీకి సెలవు ఇవ్వాల్సి ఉందన్నారు. కనీసం స్వీట్లు, గిఫ్ట్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్ నేతలు వి. మల్లికార్జునరావు, గట్టయ్య, శ్రీనివాస్, నాగేశ్వరరావు, హీరాలాల్, వీరయ్య, సాంబమూర్తి, ప్రసాద్ పాల్గొన్నారు.
టేకులపల్లి : ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో కోయగూడెం ఓసిలో సింగరేణి డే కార్యక్రమాన్ని బహష్కరించి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా సింగరేణి సంస్థల కార్మికుల సమక్షంలో యాజమాన్యం ఎంతో ఆర్భాటంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలను సాధారణ కార్యక్రమంగా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించడం పట్ల సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఆక్షేపిస్తున్నదని తెలిపారు.
అవసరం లేకపోయినా రకరకాల కారణాలతో కోట్లాది సింగరేణి నిధులను అప్పనంగా బయట వ్యక్తుల పై ఖర్చు చేస్తున్న యాజమాన్యం ఖర్చు పెట్టకుండా మొండి చేయి చూపడాన్ని నిరసించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బానోత్ బాలాజీ, కరుణ శంకర్, సామల శ్రీనివాస్, జీఎ. శ్రీనివాస్, షేక్ సర్వర్, మనోజ్ కుమార్, బండి సీతారాములు, ఆర్. సాంబశివరావు, ధల్ సింగ్, వెంకటనర్సయ్య, కనకరాజు, తుకారామ్, మహ్మద్ షబ్బీర్, ఖాదర్, జంపయ్య, శ్రీరాములు తదితరులు
పాల్గొన్నారు.
