సింగరేణిలో సొంతింటి కోసం సెప్టెంబర్11, 12 తేదీల్లో ఓటింగ్ : టి.రాజారెడ్డి

సింగరేణిలో సొంతింటి కోసం సెప్టెంబర్11, 12 తేదీల్లో ఓటింగ్ : టి.రాజారెడ్డి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికులకు సొంతిళ్లు కావాలా వద్దా.. అనే అంశంపై అభిప్రాయం తెలుసుకునేందుకు ఈనెల​11, 12 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా బ్యాలెట్​ ఓటింగ్​ నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్​ ఎంప్లాయూస్​ యూనియన్​ స్టేట్​ ప్రెసిడెంట్​ టి.రాజారెడ్డి తెలిపారు. ఆదివారం యూనియన్​ ఆఫీస్‌‌‌‌లో జరిగిన ఆర్జీ – 1 ఏరియా బ్రాంచ్​ కమిటీ మీటింగ్‌‌‌‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. 

కార్మికులు నివసిస్తున్న కంపెనీ క్వార్టర్స్‌‌‌‌లో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే కార్మికులకు సొంతిండ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్​ చేశారు. మీటింగ్​లో ఏరియా ప్రెసిడెంట్​ రాజమౌళి, సెక్రటరీ శ్రీనివాస్​, లీడర్లు ఎస్.వెంకన్న, కె.రాజన్న, రవి, నారాయణ, శివరామిరెడ్డి, సాగర్, దుర్గా ప్రసాద్, ఎన్​.రమేశ్‌‌‌‌, వి.సాగర్, రవిప్రసాద్ పాల్గొన్నారు.