సార్వత్రిక సమ్మెకు జై కొట్టిన సింగరేణి కార్మికులు

 సార్వత్రిక సమ్మెకు జై కొట్టిన సింగరేణి కార్మికులు

సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గుబావులన్నీ బోసిపోయాయి. చిర్యాల జిల్లా,  శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్ లో ఉదయం నుంచే సింగరేణి సమ్మె ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 
స్వచ్ఛందంగా బంద్ 
సార్వత్రిక సమ్మెకు జై కొట్టిన సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కార్మికులు సమ్మె బాట పట్టడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.  ఆర్కే 7 వద్ద నాలుగు జాతీయ కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. 
శ్రీరాంపూర్ ఏరియా బస్టాండ్ వద్ద రాస్తారోకో
మంచిర్యాల జిల్లా రామగుండం రీజియన్ లో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆరు బొగ్గుగనులు, నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో మొదటి షిప్ట్ లోని కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయ ఏర్పడింది. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్ముకుంటోందని కార్మిక నేతలు మండిపడ్డారు. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం  వేలం వేయాలని చేస్తోందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రయివేటికరణను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శ్రీరాంపూర్ ఏరియా బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు. రాస్తారోకో వల్ల వాహనాల రాకపోకలు చాలాసేపు స్తంభించిపోయాయి. 
పెద్దపల్లి జిల్లా ఓ సి పి 5 వద్ద లారీలను సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. జిడికె  2వ బొగ్గుగని పై ఐ ఎఫ్ టి  యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 

 

ఇవి కూడా చదవండి

దేశంలో భగ్గుమంటున్న చమురు ధరలు

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది

అంగరంగ వైభవంగా ఆస్కార్ ప్రదానోత్సవం

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో