కరోనా వైరస్ సోకి మరో సింగర్ మృతి

కరోనా వైరస్ సోకి మరో సింగర్ మృతి

కరోనా వైరస్ సోకి మరో సింగర్ చనిపోయాడని ఓ ఇంగ్లీష్ వార్తా సంస్థ ప్రచురించింది. పాటల రచయిత, సింగర్ 52 ఏళ్ల ఆడమ్‌ ష్లెసింగర్‌ కరోనా సోకి మృతి చెందాడు. ఆడమ్ గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత. అంతేకాదు పాప్‌ రాక్‌బ్యాండ్ ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ సహ వ్యవస్థాపకుడు కూడా. ఆడమ్‌ మరణాన్ని ఇటీవల కరోనా బారిన పడిన నటుడు టామ్‌ హంక్స్‌ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఆడమ్‌ 1995లో న్యూయార్క్ లో ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ అనే రాక్‌ బ్యాండ్‌ను స్థాపించారు. హాంక్స్‌ సినిమా ‘దట్‌ ధింగ్‌ యు డు’ చిత్రానికి పాటల రచయితగా పనిచేశారు. అయితే ఈయన రాసిన పాట మంచి పాపులారిటీ సంపాదించింది.. ఈ మూవీ ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు ఎంపికైంది. ఆడమ్‌ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతోపాటు అన్ని ప్రధాన అవార్డును సొంతం చేసుకున్నాడు. 2009 లో ‘ఎ కోల్బర్ట్‌ క్రిస్మస్‌’కి ఆడమ్‌ గ్రామీ అవార్డు దక్కించుకున్నాడు. ఆడమ్‌ మృతిపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.