సునీత భావోద్వేగ పోస్ట్ : నేను జీవితంలో స్ధిరపడాలని నా పిల్లల కోరిక

సునీత భావోద్వేగ పోస్ట్ : నేను జీవితంలో స్ధిరపడాలని నా పిల్లల కోరిక

టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె స్నేహితుడు, వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సోమవారం నిశ్చితార్థం జరిగినట్లు ఆమె ప్రకటించారు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు అండగా నిలిచిన పిల్లలకు, తల్లిదండ్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.

‘ ప్ర‌తి తల్లిలాగే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఉన్నతంగా స్థిరపడేలా చూసేందుకు కలలు కంటున్నాను. అలాగే నా పిల్లలు కూడా నేను జీవితంలో స్ధిరపడాలని కోరుకున్నారు. అలాంటి అద్భుతమైన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. చివరికి ఆ క్షణం వచ్చింది. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్‌ భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే నన్ను ఆదరించి, మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా’.. అంటూ సోష‌ల్ మీడియాలో తెలిపారు.