సిరివెన్నెల త్వరగా కోలుకునేందుకు చికిత్స అందిస్తున్నాం

V6 Velugu Posted on Nov 29, 2021

అస్వస్థతకు గురైన ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి..  సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ( సోమవారం) సాయంత్రం కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి.

సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీతారామశాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.

Tagged Sirivennela Seetharama Sastry, being treated, speedy recovery    

Latest Videos

Subscribe Now

More News