
మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిశోర్ ఝా మంగళవారం ఆర్డర్స్ జారీ చేశారు. మందమర్రి ఎస్సై సురేశ్‌ను నెన్నెల ఎస్‌హెచ్‌వోగా, నీల్వాయి ఎస్‌హెచ్‌వో పి.శ్యామ్ పటేల్‌ను రామగుండం వీఆర్‌కు, కన్నెపల్లి ఎస్‌హెచ్‌వో సీహెచ్.గంగారాంను దేవాపూర్ ఎస్‌హెచ్‌వోగా, ఇక్కడ పనిచేస్తున్న ఎ.ఆంజనేయులును కాసిపేట ఎస్‌హెచ్‌వోగా, అక్కడ పనిచేస్తున్న వి.ప్రవీణ్‌కుమార్‌ను వీఆర్గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం ఎస్‌హెచ్‌వో బండి రామకృష్ణను తాళ్లగురిజాలకు, అక్కడ పనిచేస్తున్న సీహెచ్.రమేశ్ ములుగు జిల్లా వీఆర్‌కు, మంచిర్యాల ఎస్సై 2గా ఉన్న సీహెచ్.కిరణ్‌కుమార్‌ను బెల్లంపల్లి టూటౌన్ ఎస్‌హెచ్‌వోగా ట్రాన్స్ఫర్ చేశారు. కన్నెపల్లి ఎస్‌హెచ్‌వోగా సీసీఎస్ భూపాలపల్లిలో ఉన్న కె.భాస్కర్‌ను బదిలీ చేశారు.