అక్కాచెల్లెళ్ల ఫేస్ చూసి పాస్‌పోర్ట్ రిజెక్ట్ చేశారు!

అక్కాచెల్లెళ్ల ఫేస్ చూసి పాస్‌పోర్ట్ రిజెక్ట్ చేశారు!

ఎవరైనా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకుంటే.. వాళ్ల ఆధార్ కార్డు, టెన్త్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లను చూస్తారు పాస్‌పోర్ట్ అధికారులు. వాటి ఆధారంగా పోస్‌పోర్టు ఇవ్వాలా వద్దా అన్నది డిసైడ్ చేయడం సహజం. కానీ హర్యానాకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఫేస్ చూసి.. వాళ్లకు పాస్‌పోర్ట్ రిజెక్ట్ చేశారు అధికారులు. ఆ అమ్మాయిలిద్దరి ముఖాలు నేపాలీలను పోలి ఉన్నాయంటూ అప్లికేషన్‌పై రాసి తిరస్కరించారు.

హర్యానాలోని అంబాలాకు చెందిన భగత్ బహదూర్ తన ఇద్దరు కుమార్తెలు సంతోషి, హెన్నాలతో ఇటీవల చండీగఢ్ పోస్‌పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ వాళ్లను చూసి.. ‘మీ ముఖాలు నేపాల్ వాళ్లలా ఉన్నాయి’ అంటూ జాతీయతను నిరూపించుకోమని అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని వాళ్లు  హర్యానా హోం మంత్రి అనీల్ విజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విషయంలో కలగజేసుకోవడంతో ఆ ఇద్దరు అమ్మాయిల పాస్‌పోర్ట్ జారీలో కదలిక వచ్చింది.

పోస్‌పోర్ట్ ఆఫీస్‌లో జరిగిన వ్యవహారంపై తాము కలగజేసుకుని వారికి పాస్ పోర్ట్ మంజూరయ్యేలా చేశామని అంబాలా డీసీపీ అశోక్ శర్మ చెప్పారు.  దీనిపై ఎంక్వైరీ చేస్తున్నామని, ముఖాలు చూసి పాస్‌పోర్ట్ రిజెక్ట్ చేసిన వాళ్లపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.