పేపర్ లీకేజీలో డబ్బుల డీల్స్ : ఏఈ పేపర్ కోసం రూ.25 లక్షలు వసూలు

పేపర్ లీకేజీలో డబ్బుల డీల్స్ : ఏఈ పేపర్ కోసం రూ.25 లక్షలు వసూలు

TSPSC పేపర్ లీకేజీ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. మార్చి 30వ తేదీ గురువారం నిందితులను CCS నుంచి హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ కు తరలించారు పోలీసులు. A10 శమీమ్, A11 రమేష్, A12 సురేష్ లు రాసిన గ్రూప్ –1 పేపర్ పై సిట్ అధికారులు ప్రశ్నించారు. గ్రూప్ –1 పేపర్ ప్రవీణ్ నుంచి  చేరినట్లు ముగ్గురు నిందితులు సిట్ కు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు వేరే ఎవరికైనా పేపర్స్ ఇచ్చారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఏఈ పేపర్ తో నిందితుడు డాక్యా నాయక్ ఐదుగురి నుండి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నీలేశ్, గోపాల్ నాయక్ పొలం తాకట్టు పెట్టీ రూ.13.5 లక్షలు ఇచ్చి పేపర్ కొనుగోలు చేశారు. రాజేందర్ రూ.5 లక్షలు చెల్లించగా.. బంగారం తాకట్టు పెట్టీ రూ 7.5 లక్షలు ప్రశాంత్ రెడ్డి చెల్లించారు. ఈ వివరాల కోసం డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్స్ పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. కాగా, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్‌ అధికారులు చేసిన దర్యాప్తు ప్రకారం ఇప్పటి వరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్‌–1 పేపర్లు ఐదుగురికి లీకైనట్లు ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 15కు చేరింది. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిందితుల సంఖ్య 16కు చేరుకుంది.