32 ఎయిర్​పోర్టులు రీఓపెన్

32 ఎయిర్​పోర్టులు రీఓపెన్

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారడంతో మూసేసిన 32 విమానాశ్రయాలను రీఓపెన్ చేస్తున్నట్టు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. విమానాల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని  ఎయిర్‌‌లైన్స్ వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. వాస్తవానికి ఈ 32 ఎయిర్ పోర్టులను మే 15 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు గతంలో ప్రకటించారు. కానీ, ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొనడంతో వాటిని తిరిగి తెరుస్తున్నట్టు స్పష్టంచేశారు.