ఫాంహౌస్ కేసులో అడ్వకేట్ శ్రీనివాస్‭కు సిట్ నోటీసులు

ఫాంహౌస్ కేసులో అడ్వకేట్ శ్రీనివాస్‭కు సిట్ నోటీసులు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. కరీంనగర్ కు చెందిన బూసారపు శ్రీనివాస్ అనే అడ్వకేట్‭కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న రామచంద్రభారతికి తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి విమానం టికెట్ కొనిచ్చినట్లు.. శ్రీనివాస్ పై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణ చేపట్టిన సిట్ అధికారులు అతడికి నోటీసులు పంపారు. ఈనెల 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే.. నోటీసులు ఇచ్చే సమయంలో అతడు ఇంట్లో లేకపోవడంతో  అధికారులు తలుపుకు అంటించి వెళ్లిపోయారు. 

ఇదే కేసులో తుషార్కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. అతడిని కూడా ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. రామచంద్ర భారతి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిల సంభాషణల్లో తుషార్ పేరు పదేపదే రావడంతో అతన్ని విచారిస్తే... మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. తుషార్ ప్రస్తుతం కేరళ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు.