ఓపెన్​ప్లేస్​లో పొగాకు వాడితే కఠిన చర్యలు: కలెక్టర్ సీతారామారావు

ఓపెన్​ప్లేస్​లో పొగాకు వాడితే కఠిన చర్యలు: కలెక్టర్ సీతారామారావు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ సీతారామారావు హెచ్చరించారు.  గురువారం కలెక్టరేట్ లో  పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టంపై జిల్లా  అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ ప్రదేశాలు, స్కూల్, కాలేజీల వద్ద ఫ్లెక్లీ బోర్డులను ఉంచాలని సూచించారు.  అన్ని శాఖల సమన్వయంతోనే  పొగాకు వాడకాన్ని తగ్గించగలమన్నారు. 

జిల్లాలో ఎన్ ఫోర్స్ మెంట్, స్వ్కాడ్ దాదాపు  రూ. 6 లక్షల 80వేల దాకా ఫైన్లు వేసి చలనా కట్టించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో  డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ వో భాస్కర్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.