మల్లాపురంలో మెడికల్ కాలేజ్ కోసం స్థల పరిశీలన

మల్లాపురంలో మెడికల్ కాలేజ్ కోసం స్థల పరిశీలన

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో మెడికల్ కాలేజ్ కోసం స్థలాన్ని కలెక్టర్ హనుమంతు జెండగేతో కలిసి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. మల్లాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 64లో ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే అధికారులు పలుమార్లు మెడికల్ కాలేజ్ కోసం ఈ స్థలాన్ని పరిశీలించి కలెక్టర్ కు నివేదిక సమర్పించారు.