
బిగ్ బాస్ (Bigg Boss)..ఈ వినూత్న షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమందిని ఒక హౌస్ లో ఉంచి..వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి, టాస్కుల పేరుతో వాళ్ళల్లో వాళ్లకె గొడవలు పెట్టిస్తూ ముందుకు సాగడం ఈ షో స్పెషాలిటీ.
ఇప్పటికే ఏడు సీజన్‌లు దుమ్ముదులిపేశాయ్. ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ (Bigg Boss Telugu Season 8) సెప్టెంబర్ 1 నుంచి మొదలై తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం 8 ఎనిమిదో వారం ఎలిమినేషన్‌తో షో రసవత్తరంగా సాగుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలుగు బిగ్ బాస్ లో స్టార్ హీరో అడుగుపెడుతున్నారు. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ అమరన్ దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో అమరన్ మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే తెలుగులో నేడు శుక్రవారం (అక్టోబర్ 26న) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ITC ఖోహినూర్ హోటల్ లో ఫంక్షన్ నిర్వహించనున్నారు.
ఇక పనిలో పనిగా అమరన్ టీం.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ప్రమోషన్స్ చేయనున్నారు. కాగా ఇందుకు సంబంధించిన షూటింగ్ను నేడు పూర్తి చేయనున్నారు బిగ్ బాస్ మేకర్స్. త్వరలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్కు రానుంది.
అయితే షోకి సహజ నటి సాయి పల్లవితో పాటు హీరో శివ కార్తికేయన్ రానున్నారు. దీంతో బిగ్ బాస్ ఆడియన్స్ తో పాటు సాయి పల్లవి ఫ్యాన్స్ తెగ ఎగ్జాయిటింగ్గా ఎదురుచూస్తున్నారు.