Parasakthi Teaser: పరాశక్తి తెలుగు టీజర్ రిలీజ్.. పవర్ ఫుల్ కాన్సెప్ట్తో ‘ఆకాశమే నీ హద్దురా’ డైరెక్టర్

Parasakthi Teaser: పరాశక్తి తెలుగు టీజర్ రిలీజ్.. పవర్ ఫుల్ కాన్సెప్ట్తో ‘ఆకాశమే నీ హద్దురా’ డైరెక్టర్

హీరో శివ కార్తికేయన్‌‌-నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ పరాశక్తి (PARASAKTHI). ఈ సినిమాతో శ్రీలీల తమిళంలో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో జయం రవి, అథర్వ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

లేటెస్ట్గా (Nov 13న) పరాశక్తి మూవీ తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. పీరియాడికల్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారు. జయం రవి క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

‘ఆకాశమే నీ హద్దురా’ డైరెక్టర్ సుధా కొంగర.. ఈ సినిమాను పవర్ ఫుల్ పొలిటికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించింది. అందుకు తగ్గట్లే సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. సైన్యమై కదిలిరా అంటూ స్టూడెంట్ లీడర్గా శివ కార్తికేయన్ చెప్పిన డైలాగ్.. టీజర్లో హైలెట్గా నిలిచింది. అయితే, తమిళ టీజర్ రిలీజైన 9 నెలల తర్వాత తెలుగు టీజర్ రావడం గమనార్హం. 

►ALSO READ | Adah Sharma: దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు.. హీరోయిన్ అదా శర్మ సంచ‌ల‌న కామెంట్స్

ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా తనకు ఇది 100వ సినిమా కావడం విశేషం. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 14న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.

2026 సంక్రాంతి సినిమాలు:

2026 సంక్రాంతికి పరాశక్తి సినిమాతో పాటుగా టాలీవుడ్‌‌‌‌ నుంచి చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ సినిమాలు ఉన్నాయి. తమిళ్ నుంచి దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ మూవీ ఉంది.