ఇండియాకు... ఆరు సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌

ఇండియాకు... ఆరు సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌

సింగపూర్‌‌‌‌‌‌‌‌: ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌–3లో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరిన ఆరు కేటగిరీల్లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్లు సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌తోనే సంతృప్తి పడ్డారు. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో సాక్షి చౌదరి–ప్రగతి–దీపికతో కూడిన ఇండియా త్రయం 232–234తో కొరియా చేతిలో ఓడింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇండియా 235–238తో కొరియా చేతిలో పరాజయంపాలైంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో రిధి పోర్‌‌‌‌‌‌‌‌–రుమా విస్వాస్‌‌‌‌‌‌‌‌–అదితి జైస్వాల్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ 3–5తో కొరియా చేతిలో, మెన్స్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో 1–5తో చైనా చేతిలో కంగుతిన్నాయి. 

మెన్స్‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో పార్త్‌‌‌‌‌‌‌‌ సలాంకే 2–6తో క్వి జియాంగ్‌‌‌‌‌‌‌‌షువో (చైనా) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌లో రుమా బిస్వాస్‌‌‌‌‌‌‌‌ 5–6తో అన్‌‌‌‌‌‌‌‌ క్విజుయాన్‌‌‌‌‌‌‌‌ (చైనా) చేతిలో పరాజయంపాలైంది. బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ప్రగతి147–146తో దీప్షికపై నెగ్గింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ టోర్నీలో ఇండియా ఆరు సిల్వర్‌‌‌‌‌‌‌‌, ఒక బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.